అదృష్టం తలుపు తడితే 1 “ఏరా శివా ఎప్పుడొచ్చావు బెంగులురునుంచి”, “ఇప్పుడు సెలవులు కుడా లేవుగా అందరు ఆఫీసుల్లో వుంటే నేవేంటి ఇక్కడ” అన్నాడు షబ్బిర్
నేను 30 రోజులు సెలవుల్లో ఉన్నలేరా , ఇంతకీ నీ టాక్సీ ఎలా నడుస్తుంది
ఏమి టాక్సీలె మామ నిద్ర లేక చస్తున్న , బిసినేస్స్ బాగానే ఉంది కానీ ఇంకో చెయ్యి కావాలిరా ఒక్కడికే బరువు గా వుంది
“ఎవరినైనా పెట్టుకోవచ్చుగా “”
ఎక్కడ మామ ఈకాలంలో ఎవరిని నమ్మడానికి వేలు లేకుండా పోతుంది , మెన్న మా పిన్ని కొడుక్కి బండిచ్చానా , తిరిగి ఇంటికి బండి వచ్చేకొద్దీ stepni టైరు కనపడాల ఏమని అడగను వాడిని ? ఆ తరువాత తెలిసింది వాడు దాన్ని ఓ మెకానిక్ కు అమ్మేసాడని, అ తరువాత వాన్ని తిట్టి పంపించేసాలే.

ఇంతకీ నీవు లండన్ నుఉంచి ఎప్పుడు వచ్చావు , మల్లి ఎప్పుడు వెళుతున్నావు , ఉద్యోగం బెంగాలురులోనేన లేక ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయిన్చుకునేదేమైన ఉందా ??

లండన్ ప్రాజెక్ట్ అయిపోయిందిరా , ప్రస్తుతానికి బెంగాలురే సెలవుల తరువాత ట్రై చేస్తాలే ఇక్కడికి రావడానికి. ఇంతకీ రాముగాడు, రాజేష్ కలిసారా ??

ఎక్కడరా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఇదిగో ఇలా ఎప్పుడో టైం దొరికితే ఇక్కడ కలుస్తాం లేదంటే ఫోన్ లో మాట్లాడ్డమే

అది సరే కాని 30 రోజులు ఏమి చేస్తావురా , ఒక్కడివే ??

నాకు ఓ టాక్సీ ఇవ్వుమా మ , నేను తిప్పుతాను అన్నాను నవ్వుతూ

నీకు టాక్సీ తిప్పే కర్మ ఎందుకులే , నీ software ఉద్యోగం ఎదో నీవు చేసుకో , ఎలాగు సెలవలు అంటున్నావుగా నాలుగు ఊర్లు తిరిగిరా నీకు పొద్దు పోతుంది , సెలవలు గడిపినట్లు ఉంటుంది.

” సరేలే గానీ మన గ్యాంగ్ కనపడితే చెప్పు” నేను వచ్చినానని, “రేపు సాయంత్రం ఇక్కడే కలుద్దాం” మామ ఉంటాను
షబ్బిర్ , నేను చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు కలిసి ఒకే ఊర్లో చదువుకున్నాము , ఆతరువాత నేనేమో scholorship’s తో పైచదువులకి హైదరాబాదు వచ్చి అక్కడే స్తిరపడ్డాను , తరువాత కొన్నాళ్ళకు వాడు కుడా బ్రతుకు తెరువుకోసం ఇక్కడికే వచ్చాడు. అప్పటి నుండి ఈ పని ఆ పని చేసి కుడపెట్టి ఓ టాక్సీ కొనుక్కొని దాన్ని తిప్పుకొంటూ కాలం గడిపేస్తున్నాడు . నేనేమే TCS లో Systems Analyst గా చేరి , ప్రస్తుతం టీం లీడర్ గా బెంగళూర్ బ్రాంచ్ లో పని చేస్తున్నా

గత 5 ఇయర్స్ గా china , londan projects మీద వర్క్ చేసి , విసుగెత్తి ఎప్పుడూ వాడుకొని లీవ్స్ కొన్నైనా తగ్గిద్దామని 30 days లీవ్ అప్లై చేసి ఇక్కడికి వచ్చా . పేరు చెప్పలేదుగా శివా రెడ్డి , రాయల సీమ లోని ఓ మారుమూల పల్లెలోంచి ఇక్కడికి వచ్చా , రైతు కుటుంబం నుంచి వచ్చా , నేనే ఆ ఊర్లో మొదటిసారి చదువుకొని బయటి వురికివెల్లి ఉద్యోగం చేసింది. చిన్నప్పటినుంచి ఇంటర్ వరకు ఉరికి పక్కన్నే ఉన్న జూనియర్ కాలేజీ లో చదివా , రోజు 7 k.m సైకిల్ మీద వెళ్లి వచ్చేవాళ్ళం . నాతొ పాటు మా వురునుంచి ఇంకో నలుగురు నాతో పాటు చదివే వారు , కానీ అందరు ఇంటర్ తో ఆపేశారు.
మా నాన్న లాగే నేను మంచి ఎత్తు 5.11 ఉంటా , పల్లె నుంచి వచ్చాముగా కస్టపడి పనిచేయడం అంటే ఇష్టం , దేనికి బయపడని తత్వం. అన్ని తెలుసుకోవాలనే మనస్తత్వం. అన్ని కలిపితే ఈరోజు నేను .
china లో 3 ఇయర్స్ ఉన్నప్పుడు అక్కడ ఆఫీస్ తరువాత పీకే పనులేమి లేక పక్కనే ఉన్న martial arts institute లో 3 ఇయర్స్ kungfu నేర్చుకొని ఓ నల్ల పట్టా సంపాదించా.

episode -1

episode – 2

మిగిలిన ఆడియో స్టోరీల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా ఆడియోలను వినండి

click here