భారతి కథనం 1 “నమస్తే మేడం!” దిద్దుతున్న పేపర్ల నుండి దృష్టి మరల్చి అతన్ని చూసాను. లేతగా, అమాయకంగా ఉన్నాడు. ఇరవై ఒకటీ, ఇరవై రెండు ఉంటాయేమో. ఎవరు నువ్వూ అన్నట్టుగా చూసాను.
“నా పేరు వాసు మేడం. లక్ష్మీ మేడం పంపించారు.” చెప్పాడతను వినయంగా. అర్ధమయినట్టుగా తల ఊపి, “మా ఇంటి ఎడ్రెస్ తెలుసా?” అడిగాను. తెలుసు అన్నట్టు తల ఊపాడు. “సరే. అయితే, సాయంత్రం ఐదు గంటలకి రా..” అని చెప్పగానే, అతను తల ఊపి వెళ్ళిపోయాడు.

నా పేరు భారతి. చిన్నతనం నుండీ క్లాసికల్ డేన్స్ అంటే పిచ్చి. మంచి డేన్సర్ గా పేరు తెచ్చుకుందామని చాలా ప్రాక్టీస్ చేసాను. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాను. కాస్తో కూస్తో పేరు కూడా సంపాదించాను. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను. అన్నీ అర్పించాను. పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాము. కానీ, పెళ్ళి తరవాత డేన్స్ మానేయాలని అతను కండిషన్. దాంతో విరమించుకున్నాను.

ఆ తరవాత ఎవరినీ పెళ్ళి చేసుకోవాలని అనిపించలేదు. ప్రోగ్రామ్స్ ఇవ్వడం కూడా తగ్గించేసాను. మధ్యలో ఇద్దరు ముగ్గురితో ఎఫైర్స్ నడిచినా, అవి ప్రేమ వ్యవహారాలు కాకుండా, కామ వ్యవహారల దగ్గరే ఆగిపోయాయి. తరవాత ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో టీచర్ గా చేరాను. అక్కడ కాస్త వెస్ట్రన్ కల్చర్ అలవాటు అయింది. వీకెండ్ లో సరదాగా వైన్ లాంటివి. అక్కడ కూడా ఒకరిద్దరు నన్ను ట్రై చేసారు కానీ, నేనే ఎవాయిడ్ చేసాను. దానికి కారణం నాకు సెక్స్ మీద ఇంటెరెస్ట్ లేకపోవడం కాదు. వాళ్ళలో ఎవరూ ఇంటెరెస్టింగ్ గా అనిపించకపోవడం. వంటరిగానే ఉండడం అలవాటు అయిపోయింది, దాదాపు పాతిక ఏళ్ళ నుండి. అయినా సరే, డేన్స్ ప్రాక్టీస్ మాత్రం మానలేదు. రోజూ ఉదయం ఒక గంట.

ఇప్పుడు నా వయసు ఏభై ఐదు. మరో వారం రోజుల్లో వాలంటరీగా రిటైర్ అవ్వబోతున్నా. డబ్బులు బాగానే నిలవచేసాను, అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి. సొంత ఇండిపెండెంట్ ఇల్లు కూడా ఉంది. ఇప్పుడు చిన్న డేన్స్ స్కూల్ పెట్టాలని అనుకుంటున్నాను. అన్ని పనులూ చూసుకోడానికి ఒక వ్యక్తి అవసరం ఉంది. ప్రస్తుతం నా దగ్గర పనిచేస్తున్న అమ్మాయి మానేయడంతో, మా ఫ్రెండ్ కి ఒక అమ్మాయిని పంపమని చెప్తే, ఆమె ఈ వాసు అనే కుర్రాడిని పంపించింది. డిగ్రీ పూర్తయిందనుకుంటా. సాయంత్రం అన్నీ మాట్లాడాలి.

అయితే, అతన్ని రమ్మన్నానన్న విషయం మరచిపోయా. చిన్న షాపింగ్ చేసుకొని వెళ్ళేసరికి, సాయంత్రం ఏడు దాటి పోయింది. నేను వెళ్ళేసరికి, అతను గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అతని సంగతి గుర్తొచ్చి, నొచ్చుకుంటూ, “అయ్యో.. సారీ సారీ! మరచిపోయాను. చాలా సేపు అయిందా వచ్చి?” అడిగాను. “పరవాలేదు మేడం..” అన్నాడు వినయంగా. గేట్ దాటి కాంపౌండ్ లోకి ప్రవేశించి, మెయిన్ డోర్ తాళం తీసి, అతన్ని లోపలకి ఆహ్వానించాను. అతన్ని కూర్చోబెట్టి, “కాఫీ తెస్తానుండు..” అని వెళ్ళబోతుంటే, “వద్దు మేడం.” అన్నాడు. మొహమాటపడుతున్నాడనుకొని, “పరవాలేదు..” అంటుంటే, అతను నిజంగానే మొహమాట పడుతూ, “అది కాదు మేడం..” అని కాస్త తటపటాయించి, చెప్పలేక చెప్తున్నట్టు, “మార్నింగ్ నుండి ఏం తినలేదు మేడం. ఆకలిగా ఉంది..” అన్నాడు. “అదేంటీ?” అడిగాను ఆశ్చర్యంగా. అతను ఇంకా కుచించుకుపోతూ, “బస్ లో నా డబ్బులు ఎవరో కొట్టేసారు.” అన్నాడు. అయ్యో పాపం అనిపించింది. “అయ్యో! సరే ఉండు బాబూ.. వంట చేసేస్తాను. ముందు తినేసి, తరవాత తీరుబడిగా మాట్లాడుకుందాం.” అన్నాను. “మేడం, నన్ను చేయమంటారా!” అడిగాడు. నేను జవాబు చెప్పేలోగా, “బాగా చేస్తాను మేడం..” అన్నాడు హుషారుగా. నేను “వద్దూ..” అనేలోగా, అతను చనువుగా “కిచెన్ ఎక్కడ మేడం..” అనగానే, నేను నవ్వుకుంటూ, “రా..” అంటూ కిచెన్ లోకి తీసుకుపోయాను.

episode -1

episode – 2

మిగిలిన ఆడియో స్టోరీల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా ఆడియోలను వినండి

click here